టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు.ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలో చోటు చేసుకున్న అవకతవకలపై ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అనుకూల ఓట్లు తొలగించడంపై ప్రధానంగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా సీఈసీకి అందజేయనున్నారు.
అక్రమాలు నివారించటంతో పాటు బాధ్యులైన ప్రతి అధికారిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని సీఈసీని చంద్రబాబు కోరనున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనేక చోట్లకు మార్చేస్తున్నారని ఆరోపిస్తోంది. పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను నకిలీ డోర్ నంబర్లు, నకిలీ చిరునామాలతో ఓటర్ల జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపాలని నిర్ణయించారు.
మరోవైపు ఈ నెల 28న ఢిల్లీలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు వందో జయంతి సందర్భంగా ఆయన స్మృత్యర్థం ప్రత్యేక నాణేలను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే యోచనలో చంద్రబాబు ఉన్నాట్లు తెలుస్తోంది. అదే రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసే అవకాశం ఉంది అంటున్నారు. అపాయింట్మెంట్ కోరుతూ ఎన్నికల కమిషన్కు లేఖ పంపారు.