‘చంద్రయాన్-2’ నాసాదట, వైసీపీ అభిమాని ‘ఫ్లెక్సీ’ వైరల్!

chandrayaan-2-ycp-fan-flexioviral

‘చంద్రయాన్-2’ను విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో ప్రపంచమంతా ఇండియాను అభినందనలతో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో వై.చిన్నియాదవ్ అనే వ్యక్తి దివంగత నేత వైఎస్సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తదితర వైసీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీ తయారు చేసి నాసా(NASA)కు అభినందనలు తెలిపాడు.

అదేంటీ.. ‘చంద్రయాన్-2’కు నాసాకు సంబంధం ఏమిటీ? ఆ ప్రయోగం చేపట్టింది ఇస్రో కదా అనేగా మీ సందేహం? ఔను నిజమే! కానీ, ఆ ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తికి దీనిపై అవగాహన లేదు. దీంతో గుడ్డిగా ‘నాసా’ పేరు రాయించాడు. అయితే, అది కావాలానే ఎవరైనా మార్ఫింగ్ చేశారో, లేదా నిజంగానే అతడు అలా రాయించాడా అని తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియా ప్రయోగం చేపడితే.. ఎక్కడో అమెరికాలో ఉన్న ‘నాసా’కు అభినందనలు చెప్పడం ఏమిట్రా బాబు? అని అంతా తలలు కొట్టుకుంటున్నారు. ‘ఇస్రో’ ఇండియాలో ఉందని, ఏపీలోని శ్రీహరికోట వేదికగా ఈ ప్రయోగం చేపట్టిందనే అవగాహన కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.