ఈ మద్య సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న గవర్నర్ల మార్పు వార్తల వెనుక ఏముంది, నిజానికి రాజ్యాంగం ప్రకారం అత్యున్నత హోదా మినహా పాలనా వ్యవహారాల్లో అంతగా సంబందం లేని గవర్నర్ల గురించి ఎందుకింత చర్చ నడుస్తుంది, దీనికి చాలా లోతైన కారణాలున్నాయి, గత దశాబ్ద కాలంగా రాష్ట్రపతులు, గవర్నర్లు రాజకీయాలకి పూర్తిగా దూరంగా జరగలేదు, ప్రణబ్ ముఖర్జీ లాంటి నేత సైతం రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం, ఆ వెంటనే బెంగాల్లో బీజేపీ పాగా వేయడం వంటి విషయాలకి కూడా ఎంతో కొంత సంబందం ఉందనేది ఓ వర్గం వాదన, అలాగే తెలంగాణా ఉద్యమ సమయంలోనూ ప్రస్తుత గవర్నర్ నరసింహాన్ నిర్వహించిన పాత్ర తక్కువేమీ కాదని కొంత మంది చెబుతుంటారు, ఇలా దీనిని బట్టి ఆయా రాష్ట్రాల్లో పాగా వేయడానికి అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి అదికారికి సమాచారం పూర్తిగా అందుబాటులో ఉండే గవర్నర్లు కీలకంగా ఉపయేగపడుతారని పార్టీలు నమ్ముతున్నాయి, అందుకే గతంలో మాదిరిగా ఏదో విశ్రాంతి తీసుకుంటున్న విదేయులైన సీనియర్లకో, లేదా సీనియారిటీ ఉన్న నేతలకో ఇచ్చే రాజ్యంగ బద్ద పదవులు వ్యూహకర్తలకి ఇవ్వడానికి కారణమవుతున్నాయి. ఇందులో బాగంగానే తమకి అనుకూల వాతావరణం కల్పించడానికి ఆయా పార్టీలే సోషల్ మీడియాలో ఇలా వదంతుల్ని స్రుష్టించి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆదారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.