ఆ ఫ్యామిలీ కి సమంత అంటే పంచ ప్రాణం

ఆ ఫ్యామిలీ కి సమంత అంటే పంచ ప్రాణం

ప్రస్తుతం సినీ సర్కిల్స్ అంతటా హాట్ ఇష్యూగా చర్చల్లో నిలుస్తున్న అంశం చై- సామ్ డివోర్స్. గత నెల రోజులుగా జనాల్లో నెలకొన్న సందేహాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తూ తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సమంత, నాగ చైతన్య. విడాకుల తర్వాత తమ మధ్య స్నేహబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో పేరు ప్రఖ్యాతలున్న అంత పెద్ద ఫ్యామిలీని సమంత కట్ చేసుకోవడంపై ఎన్నో రకాల పుకార్లు బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు రియాక్ట్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీని వదులుకోవడం సమంత తప్పే అంటూ నొక్కి చెప్పారు ఇమంది రామారావు. చై-సామ్ డివోర్స్ బలవంతంగా జరిగిందని, ఎవరో దీని వెనుక ఉండి ఈ బంధాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్ని చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక సీనియర్ జర్నలిస్టుగా చెబుతున్నా.. ”చిన్న చిన్న అపార్దాలు ఎక్కడైనా వస్తాయి. నాగార్జున చాలా వైడ్‌‌గా ఆలోచిస్తారు. వెనకాల సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఉన్నారు. సమంత తొందరపడినా వాళ్ళు తొందరపడరు. సమంత కూడా చాలా తెలివైంది. కానీ తెలివి ఎక్కువయ్యే ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం లాంటి సంసారాన్ని కాళ్ళ దన్నుకుంది.

ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఓ ఆరు మాసాల తర్వాత మీరు కలిసి ఉండాలనుకుంటే ఆ అవకాశాన్ని కోర్టు కల్పిస్తుంది.ఇప్పటికీ ధైర్యంగా చెబుతున్నా. సమంతకు చైతూ కంటే మంచి మొగుడు రాడు. ఇక్కడ పొందే ఆనందం కంటే ఎక్కువ ఆనందం బయట పొందలేవు. సుమారు 7 సంవత్సరాలు కలిసి ఉన్న మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. మగవాడు తొందరపాటు ప్రదర్శించినా కూడా ముమ్మాటికీ సమంతదే తప్పంతా. ఇద్దరు విడిపోతే శిక్ష ఎవరికి? ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన బాధ్యత సమంతకే ఉంది.

అడుగు వేసే ముందు వెయ్యి రకాలుగా ఆలోచించు. మామ గారితో నీ మనసులో కలిగిన గాయాన్ని చెబితే అయిపోయేది. అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టడం సమంత అదృష్టం. ఆ ఫ్యామిలీ మొత్తానికి సమంత అంటే పంచ ప్రాణం. సిరి సంపదలకు డోకా లేదు. సహజంగా చాలా కుటుంబాల్లో అభిప్రాయం బేధాలు వస్తుంటాయి. దానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? దీనిపై ఆమె తల్లితండ్రులు సరిగా అవగాహన ఇచ్చి ఉండరు. ఏదేమైనా చివరకు దెబ్బతినేది ఆడపిల్లే అవుతుంది.

రేపు సమంత జీవితం ఏమిటి? అంత పెద్ద కుటుంబాన్ని వదులుకొని పోతున్నావు. రేపు నీ పెళ్లి జరుగుతుందా? ఒకవేళ జరిగినా అక్కడ మనస్పర్థలు రావా? ఇవన్నీ ఆలోచించకుండా నూరేళ్ళ కాపురాన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటే ఎలా? నా భార్య సినిమాల్లో నటించకూడదు. ఎందుకు మనకు లేదా అని చైతూ ఆలోచించి ఉండొచ్చు. మరో సమస్య పిల్లల్ని కనడం.. పిల్లలు కనడానికి తనకు ఇష్టం లేదు. సరోగసీ అదీ ఇదీ అని ఆలోచన చేశారు. మరి మగవాడికి ఎలా ఉంటుంది?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇమంది రామారావు.