దారుణం: పెళ్లి.. చేసుకుంటానని.. కోటి గుంజేసింది.. ఆపై…..

marriage

నిత్యం సమాజంలో మాయలు, వింతలు, మోసాలు పలు రకాలైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా కానీ…తెలుసుకుంటున్నాగానీ.. ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని చెప్పి  సినిమా స్టైల్ లో నమ్మించి మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ జాదూ మహిళా.. పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మోసం చేసింది. దాంతో ఏకంగా రూ. కోటి కాజేసి జంప్ అయిపోయింది. దాంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలను బట్టి చూస్తే.. వసంతనగర్‌కు చెందిన అర్జున్ (రక్షిత పేరు) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా ఉద్యోగిస్తున్నాడు. అతనికి తెలుగు మాట్రిమొనీలో సింధు (రక్షిత పేరు) పేరిట ఓ మహిళ పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్‌, వాట్సాప్‌ కాలింగ్‌ ద్వారా మాట్లాడుకొంటున్నారు. తాను అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని సింధు (రక్షిత పేరు) బాగా నమ్మించింది. తన తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లో ఉంటూ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది.

అదే విధంగా తన తల్లిదండ్రులు తనను పారిశ్రామికవేత్త కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని చూస్తున్నారని.. కానీ తనకు వాళ్లు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఆ సాఫ్ట్ వేర్ ని మాయమాటలతో నమ్మించింది. అలాగే.. తనకు దక్కాల్సిన ఆస్తులు కుటుంబ సభ్యులు ఇవ్వనంటున్నారని కూడా వివరించింది. లీగల్‌ సమస్యల పరిష్కారానికి రూ.కోటి ఖర్చవుతుందని ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించింది. దీంతో అర్జున్ (రక్షిత పేరు)  పలుమార్లు ఆమె పంపిన బ్యాంకు ఖాతాకు రూ.1,02,18,033 వరకు పిపించాడు. ఆ తర్వాత ఆమె అస్సలు కాంటాక్ట్‌లో లేకుండా మాయమైపోయింది. దీంతో ఇక అతడు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించాడు. విలాస జీవితానికి అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ విషయంలో పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.