సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటలపాటు ఘర్షణ వాతావరణం నెలకొంది.
భారత బంకర్లను ధ్వంసం చేసేందుకు చైనా ఆర్మీ యత్నించింది. దీంతో భారత సైన్యం చైనా కుట్రలను ధీటుగా తిప్పికొట్టింది. కాగా, రెండు దేశాల సైనికులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.