Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట. చైనా సంగతి చూస్తే ఆ సామెత నిజమే అనిపిస్తోంది. చుట్టుపక్కల దేశాలన్నింటితో వైరం కొనితెచ్చుకుంటున్న చైనా.. ఇప్పుడు భారత్ పై కన్నేసింది. నయాన భయాన దారికి తెచ్చుకోవాలని సూచించింది. కానీ కుదరకపోయేసరికి.. భారత్ లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తమ దేశీయులకు పిలుపునిచ్చింది చైనా.
గ్లోబల్ పవర్ గా ఎదిగిన భారత్ లో చాలా మంది చైనీయులు పనిచేస్తున్నారు. కానీ నెల రోజుల పాటు అనవసర ప్రయాణాలు చేయొద్దని డ్రాగన్ వారికి సూచించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో.. చైనీయులపై దాడులు జరిగే అవకాశం ఉందని, ఏమైనా ఇబ్బంది వస్తే ఎంబసీని సంప్రదించాలని సూచించింది.
ఓవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రధానితో నవ్వుతూ మాట్లాడుతున్న చైనా అధ్యక్షుడు.. తెరవెనుక మాత్రం గోతులు తీస్తున్నారు. గతంలో నెహ్రూతో కూడా స్నేహంగా మెలగి మరీ హ్యాండిచ్చిన చరిత్ర డ్రాగన్ కు ఉంది. అయితే మోడీ దగ్గర తమ పప్పులు ఉడకడం లేదని డ్రాగన్ తెగ ఇదైపోతోంది. కానీ చైనీయులు మన దేశంలో ప్రయాణించకపోతే వారికే నష్టమని మన నిపుణులు చెబుతున్నారు. చైనాలో లేని చాలా ప్రత్యేకతలు మన దేశానికి ఉన్నాయంటున్నారు.