Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో పలువురు స్టార్ డైరెక్ట్ర్స్ ఉన్నారు. వారిలో కొందరు అదృష్టంతో సక్సెస్ అయితే మరి కొందరు మాత్రం పూర్తిగా తమ ట్యాలెంట్‌తోనే సక్సెస్ అయిన వారు ఉన్నారు. ట్యాలెంట్‌తో సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుల్లో సుకుమార్ ముందు వరుసలో ఉంటాడు. తాను తీసిన ప్రతి సినిమాను వైవిధ్యంగా, విభిన్నంగా తీయడం ఆయన స్టైల్. తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకు వెళ్లగల సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్. ప్రేక్షకుల పరిధిని పెంచి, వారి ఆలోచన స్థాయిని పెంచే దర్శకుడు కూడా సుకుమార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్క్రీన్‌ప్లే బేస్‌తో నడిచే చిత్రాలు ఇండియాలో చాలా తక్కువ వస్తాయి. అలాంటి చిత్రాలకు సిద్ద హస్తుడిగా పేరున్న సుకుమార్ ప్రస్తుతం చరణ్‌తో ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. చరణ్‌తో సినిమా పూర్తి అయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవితో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. రీ ఎంట్రీతో సూపర్ డూపర్ను దక్కించుకున్న చిరంజీవి తన తర్వాత అన్ని చిత్రాలు కూడా అదే స్థాయిలో ఉండాలనే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు మంచి కథలు మంచి దర్శకులతో సినిమా చేయాలని చిరంజీవి భావిస్తున్నాడు. తాజాగా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని చేస్తున్నాడు. స్టైలిష్ దర్శకుడిగా పేరున్న సురేందర్ రెడ్డి ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత చిరంజీవి 152వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇదే సంవత్సరం చివర్లో చిరు, సుక్కుల కాంబో మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇదే కనుక నిజం అయితే దుమ్ము దుమ్ము సూపర్ న్యూస్ అని మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.