కేసీఆర్‌ని పరామర్శించిన చిరంజీవి, పలువురు ప్రముఖులు

Chiranjeevi and many celebrities visited KCR
Chiranjeevi and many celebrities visited KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పలువురు ప్రముఖుల పరామర్శించారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకుని వైద్యు ల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్‌ను కలిసి కేసీఆర్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. కేసీఆర్‌కు అందుతున్న వైద్య సేవలపైనా భట్టి ఆరా తీశారు. కేసీఆర్‌ వేగంగా కోలుకుంటున్నారని భట్టి తెలిపారు. కేసీఆర్‌ను సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రకాష్‌ రాజ్‌ కలిసి.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు.

కేసీఆర్‌ను BSP నేత ఆర్‌.ఎస్. ప్రవీణ్‌కుమార్ పరామర్శించి.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. ప్రముఖుల పరామర్శల దృష్ట్యా … సోమాజీగూడ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి వాహనా రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో కిందపడడంతో గాయపడ్డ కేసీఆర్‌ను వెంటనే సోమాజిగూడ యశోదా దవాఖానకు తరలించగా పరీక్షలు నిర్వ హించిన వైద్యులు తుంటి ఎముక ఫ్యాక్చర్ అయిందని తెలిపి అదే రోజు రిప్లేస్‌మెంట్ సర్జరీ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆదివారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించగా ఈ రోజుమెగాస్టార్ చిరంజీవి యశోదా దవాఖానకు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. చిరంజీవి మాట్లాడుతూ కేసీఆర్ చాలా హెల్తీగా ఉన్నారని త్వరలోనే దైనందిన జీవితంలోకి వస్తారంటూ తెలిపారు. సర్జరీ చేసిన 24 గంటల్లోనే నడిపించిన డాక్టర్ల కృ షి అభినందనీమయమన్నారు. కేసీఆర్‌ సినీ ఇండస్ట్రీ గురించి కూడా అడిగారని అంతా బావుందని చెప్పానన్నారు. డాక్టర్లు 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.