రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం వినయ విధేయ రామ ఈ చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, తమిళ నటుడు ప్రశాంత్, స్నేహ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాలతో పాటుగా ఆడియో వేడుకకు సిద్దం అయ్యింది. యూసఫ్ గూడాలోని పోలీస్ లైన్స్ లో కోట్ల మైదానంలో ఈ వేడుక జరగనున్నది. మెగా ఈవెంట్స్ కు మెగా ఫాన్స్ సందడి కుడా మొదలైంది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్స్ వస్తున్నారని తెలియడంతో మెగా ఫాన్స్ లో మాములు హంగామా లేదు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా వస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఈ ఆడియో ఫంక్షన్ కి వస్తున్నారని తెలియడంతో నందమూరి ఫాన్స్ కూడా వివిఅర్ కు సిద్దం అయ్యారు. మరో ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే బాహుబలి టీం రానా, ప్రభాస్ లుకుడా ఈ ఆడియో వేడుకకు విచేస్తున్నారు. ఇంత మంది స్టార్స్ రావడంతో ఈ ఆడియో ఫంక్షన్ కు భద్రత కూడా ఎక్కువగానే ఏర్పాట్లు చేశారు. మరి ఎంతమంది భద్రత సిబ్బంది ఉన్న ఇటు మెగా ఫాన్స్….అటు నందమూరి ఫాన్స్ ను తట్టుకునే శక్తి పోలీస్ లకు ఉండాలి అంటున్నారు కొందరు. చరణ్ కుడా రంగస్థలం తరువాత తను నటించిన చిత్రం వినయ విధేయ రామ కావడంతో భారీ హంగామా చేస్తున్నాడు. ఈ చిత్రాని సంక్రాంతి కానుకగా విడుదలచేసి ఈ సారి సంక్రాంతి అంటే మెగా ఫ్యామిలీదే అనిపించుకోవాలని చరణ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. డివివి దానయ్య ఈ చిత్రాని నిర్మించాడు.