కొరటాల శివని మరో చిత్రం చేయనివ్వకుండా ఏడాది కాలంగా ఖాళీగా వుంచేసాడు రామ్ చరణ్. ‘భరత్ అనే నేను’ తర్వాత చిరంజీవి కోసమని ఒక కథ చెప్పడానికి వెళ్లిన శివని అప్పట్నుంచీ చరణ్ ఎటూ వెళ్లనివ్వలేదు. కొరటాల శివ లాంటి దర్శకుడు ఒకసారి వచ్చి వెనక్కి వెళితే మళ్లీ వెంటనే ఆ ప్రాజెక్ట్ సెట్ అవదనేది చరణ్‌కి తెలుసు. అందుకే ఎప్పుడో గత డిసెంబర్లో మొదలు పెడతానన్న సినిమాని ఈ డిసెంబర్ వరకు లాక్కొచ్చాడు. ఈ చిత్రాన్ని ఏకధాటి షెడ్యూల్స్‌తో వంద రోజుల్లోగా పూర్తి చేయాలని ప్లాన్ చేసారు.
అయితే చిరంజీవి మునుపటిలా నిరాటంకంగా పని చేసే ఆరోగ్యంతో లేరు. వయసు మీద పడడంతో ఆయన విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పాటికే మొదలు కావాల్సిన కొరటాల శివ చిత్రం ఈ కారణంగానే ఇంకా మొదలు కాలేదు. వేసవిలోనే విడుదల చేసేలా వాయువేగంతో పూర్తి చేయాలంటే చిరంజీవి ఈ తరహా ఎనర్జీ లెవల్స్‌తో వుంటే కష్టమేనని గుసగుసలాడుకుంటున్నారు.
అయితే వేసవిలో విడుదల చేయడం ఈ చిత్రానికి చాలా కీలకం. ఒక్కసారి సమ్మర్ సీజన్‌ని మిస్ చేసి వెనక్కి వెళితే కనుక రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’తో తంటా వచ్చి పడుతుంది. సైరా చిత్రానికి ఫిజికల్‌గా బాగా కష్టపడిన చిరంజీవి ఈ చిత్రం పూర్తి చేసే వరకు అదే ఉత్సాహంగా వుంటారా లేదా అనే దానిపై ఈ చిత్రం ఎప్పుడు విడుదలయ్యేదీ తేలుతుంది.