వారికి షాక్ ఇచ్చిన చిరంజీవి

chiranjeevi given shock to them

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ముందుగా చిరంజీవి తన పాత్రకి డబ్బింగ్ చెప్పేశారు. అది కూడా కేవలం 20 గంటల సమయం మాత్రమే తీసుకుని ఫినిష్ చేయడంతో శబ్దాలయ రికార్డింగ్ స్టూడియో వర్గాలు కూడా షాక్ తిన్నాయట. ఏదైనా రొటీన్ కమర్షియల్ చిత్రమైతే అది వేరే అనుకోవచ్చు కానీ సైరా వేరు ప్రతిష్టాత్మక స్వాతంత్ర సమరయోధుడి కథ. సాయి మాధవ్ బుర్ర పరుచూరి బ్రదర్స్ లాంటి వారు ఈ సినిమా కోసం పని చేశారు, అందులోనూ బ్రిటిషర్లను సవాల్ చేసే సీన్స్ లో చాలా పెద్ద పెద్ద సంభాషణలు ఉంటాయి. ఇంతటి భారీ చిత్రానికి ఇంత త్వరగా చిరు డబ్బింగ్ పూర్తి చేయడం విశేషమని అంటున్నారు. ఇక సుదీప్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనుండగా, విజయ్ సేతుపతి పాత్రకి మాత్రం వేరొకరితో డబ్బింగ్ చెప్పించనున్నారు. నయనతార కథానాయికగా చేస్తోన్న ఈ సినిమాలో, ఓ ముఖ్యమైన పాత్రలో తమన్నా కనిపించనుంది.