చిరంజీవి కోసం ఫ్రెష్ భామ

new heoine for chiranjeevi

రెండేళ్ళ క్రితం ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఆయన చేస్తున్న ప్రస్తుత సినిమా సైరా నరసింహారెడ్డి షూటింగ్‌ మొన్ననే పూర్తి కాగా ప్రస్తుతం ఆ సినిమా డబ్బింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా డబ్బింగ్ పూర్తయ్యాక కొద్దిరోజులు ఆగి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలోనే ఉత్కంట కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఈ సినిమాలో ఆయన సరసన నయనతార లేదంటే శృతిహాసన్‌ను తీసుకోవాలని కొరటాల చూస్తున్నట్లు ప్రచారం జరిగినా తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల శివ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోయే కొత్త ముఖం కోసం కొరటాల వెతుకుతున్నారని అంటున్నారు.  .