గురువు ఇంటికి వెళ్లిన చిరు

గురువు ఇంటికి వెళ్లిన చిరు

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ని చిరంజీవి గురువులా భావిస్తారు. దీపావళి పండగ సందర్భంగా సతీమణి సురేఖతో కలసి గురువు ఇంటికి వెళ్లారు చిరంజీవి. విశ్వనాథ్‌ దంపతులు చిరు దంపతులను ఆశీర్వదించారు. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి’ వంటి సినిమాలు చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచాయి.

గురు–శిష్యులిద్దరూ తమ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల విశేషాలను, ఆ సినిమాల సమయంలో ఏర్పడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘విశ్వనాథ్‌గారిని కలవాలనిపించి ఆయన ఇంటికి వచ్చాను. నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారాయన. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు చిరంజీవి.