తొలిప్రేమ పై చిరు అతిశయోక్తి వ్యాఖ్యలు

chiranjeevi over comments in varun tej toliprema success meet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ‘తొలిప్రేమ’ చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్‌ సభ్యులను సన్మానించాడు. వరుణ్‌ తేజ్‌, రాశిఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మంచి ప్రేమ కథ అంటూ టాక్‌ రావడంతో యూత్‌ ఆడియన్స్‌ ఈ చిత్రంపై ఆసక్తి కనబర్చుతున్నారు. సినిమా మొదటి వారం రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంను తాజాగా చిరంజీవి చూసి వరుణ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కాస్త అతిశయోక్తిగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

‘తొలిప్రేమ’ చూసిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. మా కుటుంబ గౌరవం పెంచే విధంగా ఈ చిత్రం ఉందని, వరుణ్‌ తేజ్‌ మా ఫ్యాన్స్‌ హోదాను మరింతగా పెంచాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి సినిమా చేసినందుకు వరుణ్‌ చాలా అదృష్టవంతుడు అని, తొలిప్రేమ ఒక అద్బుతమైన ప్రేమ కథ చిత్రం అంటూ అభినందనలు తెలియజేశాడు. గతంలో, ఇటీవల ‘తొలిప్రేమ’ వంటి, అంతకు మించిన లవ్‌ స్టోరీలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాని ఎప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించింది లేదు. కాని ఈసారి మాత్రం తన తమ్ముడి కొడుకు అవ్వడం వల్ల చాలా అతిశయోక్తిగా మాట్లాడాడు. మెగా ఫ్యామిలీ గౌరవం పెంచే సినిమా అంటూ ‘తొలిప్రేమ’ గురించి చిరు చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చరణ్‌, బన్నీలు ఎన్నో అద్బుతమైన చిత్రాలు చేశారని, మెగా ఫ్యామిలీ గౌరవంను పెంచేలా పవన్‌ కూడా పలు చిత్రాలు చేశాడని మెగా ఫ్యాన్స్‌ సైతం అంటున్నారు. వరుణ్‌ తేజ్‌ను ప్రశంసించాలనే ఉద్దేశ్యంతో చిరు కాస్త అతిగా పొగడ్తలు గుప్పించాడు.