Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి తర్వాత ప్రభాస్ కు బాలీవుడ్ హీరోలను మించిన క్రేజ్ వచ్చింది. ఆయన తదుపరి సినిమాలు, రెమ్యునరేషన్, వ్యక్తిగత జీవితం ఇలా… ఆయనకు సంబంధించిన ప్రతి విషయం జాతీయస్థాయిలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సాహోలో నటిస్తున్నాడు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమా సంగతులను ఎప్పటికప్పుడు నేషనల్ మీడియా కవర్ చేస్తోంది. అదే సమయంలో జాతీయ మీడియా ప్రభాస్ పెళ్లి వ్యవహారంపైనా తెగ ఆసక్తి చూపిస్తోంది. గతంలో టాలీవుడ్, కోలీవుడ్ మీడియాతో పాటు అనేక ఇంగ్లీష్ మ్యాగజైన్లు కూడా ప్రభాస్, అనుష్కల పెళ్లంటూ వచ్చిన రూమర్లను ప్రచురించాయి. వారిద్దరూ ఆ రూమర్లను ఖండిచడంతో… ఇక ఆ వార్తలకు తెరపడి… ప్రభాస్ పై కొత్తగా మరో పుకారు మొదలయింది.
ఈ పుకారు నిజానికి గతంలో ఓ సారి వినిపించినప్పటికీ… ఇప్పుడు మాత్రం ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. నాగబాబు కూతురు నిహారికతో ప్రభాస్ పెళ్లి జరగబోతోందంటూ తెలుగు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఆరా తీసిన జాతీయ మీడియా సంస్థ జీన్యూస్ ఏకంగా చిరంజీవినే ప్రశ్నించి… ఓ కథనం ప్రసారంచేసింది. ప్రభాస్, నిహారిక పెళ్లివార్తలను చిరంజీవి ఖండించారని, ఈ వార్తలన్నీ అవాస్తవమని ఆ కథనంలో వివరించింది. మొత్తానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి కబురు కోసం జాతీయ మీడియా కూడా ఎదురుచూస్తుందన్నమాట. మరి ప్రభాస్ ఆ కబురు ఎప్పటికి వినిపిస్తాడో……