Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం లోగో లాంచ్ కార్యక్రమం నిన్న రాజమౌళి చేతుల మీదుగా లాంచనంగా జరిగిన విషయం తెల్సిందే. ఆ కార్యక్రమంలో చిరంజీవి కొన్ని కారణాల వల్ల పాల్గొనలేదు. అయితే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులకు, లోగో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి, వినాయక్, సుకుమార్‌లకు థ్యాంక్స్ చెప్పేందుకు ఇంకా తన బర్త్‌డే సందర్బంగా రక్తదాన శిభిరాలు నిర్వహించిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పేందుకు ఒక వీడియో సందేశం విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో సందేశంలో చిరంజీవి ఈ చిత్రం చేయడంతో తన కల నెరవేరబోతుందని చెప్పుకొచ్చాడు.
చిరంజీవి మాట్లాడుతూ.. చాలా కాలంగా తనకు స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నటించాలనే కోరిక ఉండేది. భగత్‌సింగ్ వంటి పాత్రలో నటించాలని కలలు కన్నాను. కాని సాధ్యం కాలేదు. ఎట్టకేలకు అది ‘సైరా నరసింహారెడ్డి’ జీవిత కథలో నటించడం ద్వారా సాధ్యం అవుతుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఒక గొప్ప పోరాట యోధుడి జీవిత చరిత్రలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉందని, తన చిరకాల స్వప్నం నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఒక అద్బుతమైన చిత్రంగా సైరా నరసింహారెడ్డి ఉంటుందనే నమ్మకంను చిరంజీవి వ్యక్తం చేశాడు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చక్కగా ఆవిష్కరిస్తాడనే నమ్మకం ఉందని, రామ్ చరణ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతను ఖచ్చితంగా బాగా మోస్తాడనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు: