Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించకుండా… రాజకీయాలకు అతీతం అన్నట్టుగా ఉంటున్న ప్రముఖ సినీనటుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మీద ప్రేమో మరేదో కారణమో తెలియదు కానీ… తిరుపతికి సంబంధించిన ఓ సమస్యపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని లేఖలో చిరంజీవి ప్రశ్నించారు.
తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీని ఖాళీ చేయించటాన్ని చిరంజీవి తప్పుబట్టారు. తిరుపతి నడిబొడ్డున ఆ కాలనీ ఉండటం ఇష్టం లేకే ఖాళీ చేయిస్తున్నారని ప్రభుత్వంపై చిరంజీవి విమర్శలకు దిగారు. ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించేందుకే ఆ కాలనీని ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న చిరంజీవి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవటం లేదు. అలాగనీ రాజ్యసభ ఎంపీగానూ చురుగ్గా పనిచేయటం లేదు.
ప్రస్తుతం ఆయన ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా పార్ట్ టైం రాజకీయవేత్తగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఆయన పార్టీ పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత రాజకీయాల్లో చిరంజీవి పెద్దగా యాక్టివ్గా లేరు. కాంగ్రెస్ ఏపీలో నిర్వహించే కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ అలా మెరుస్తారు. మొత్తానికి+చాన్నాళ్ల తరువాత ఓ ప్రజా సమస్యపై అధికార పార్టీకి లేఖ రాసి తానింకా యాక్టివ్ పాలిటిక్స్ లో నే ఉన్నానని చాటాలనుకుంటున్నారు చిరంజీవి.
మరిన్ని వార్తలు: