మెగాస్టార్ చిరంజీవి గారి మాజీ అల్లుడు, శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ గారు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుండగా, బుధవారం రోజున హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో మృతి చెందారు.
చిరంజీవి రెండో కూతురు శ్రీజని 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్, ఆ తరువాత ఆమెకి విడాకులు ఇచ్చాడు. వీరికి ఒక కూతురు ఉంది. అటుపై శిరిష్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు . కాగా, శ్రీజ కూడా రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.