‘సైరా నరసింహారెడ్డి’ పూర్తి వివరాలు..!

Sye Raa Narasimha Reddy cast and crew

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత ‘ఖైదీ నెం.150’ చిత్రంతో భారీగా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాతో తనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి అదే స్థాయిలో 151వ చిత్రానికి సిద్దం అయ్యాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రతో చిరు 151వ చిత్రం తెరకెక్కబోతుందని ఆరు నెలల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటి నుండి కూడా సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ చిరంజీవికి జోడీగా నటించబోతుందని, ఇంకా ఎంతో మంది నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చిరు 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’కి సంబంధించి పూర్తి వివరాలను వెళ్లడి చేయడం జరిగింది.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించబోతుంది. ఇంకా ఈ చిత్రంలో అమితాబచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతపతి, నాజర్‌, రవికిషన్‌, ముఖేష్‌ రుషి, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, జయ ప్రకాష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు ముందు నుండి అనుకుంటున్నట్లుగా సంగీతంను ఏఆర్‌ రహమాన్‌ అందిస్తున్నాడు. ఇంకా అత్యుత్తమ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు పని చేయబోతున్నారు. భావి విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు.


మరిన్ని వార్తలు:

అఖిల్ ‘హలో’ టీజర్ ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్… వీడియో

వారు చెబుతున్న సక్సెస్‌ నిజమేనా?

హిందీలో ‘ఫిదా’ చేయగలరా?