వారు చెబుతున్న సక్సెస్‌ నిజమేనా?

tapsee-pannu-anando-brahma-movie-is-really-hit

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తాప్సి హీరోయిన్‌గా శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు భారీగా ప్రమోషన్‌ చేశారు. తాప్సి ఏకంగా ‘బిగ్‌బాస్‌’ ఇంట్లోకి వెళ్లి మళ్లీ సినిమాను ప్రమోట్‌ చేసుకుంది. ఈ సినిమా తన కెరీర్‌లోనే అద్బుతం అంటూ తాప్సి తెగ ముచ్చట్లు చెప్పింది. సినిమా విడుదలైన తర్వాత వారు చెప్పిన మాటలు అన్ని కూడా ఉత్తమాటలే అనే టాక్‌ వచ్చింది. అంటే ఈ చిత్రం ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. భయపెడుతూ నవ్వించాలనుకున్న దర్శకుడు విఫలం అయ్యాడు. 

భయపెట్టడంతో పాటు నవ్వించడంలో కూడా దర్శకుడు విఫలం అయ్యాడు అనే రివ్యూలు వచ్చాయి. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మౌత్‌ టాక్‌తో సినిమాకు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయని, మీడియాలో వార్తలతో సంబంధం లేకుండా, రివ్యూలను పట్టించుకోకుండా సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రెస్‌నోట్‌ను విడుదల చేయడం జరిగింది. నిజంగానే వారు చెబుతున్నట్లుగా మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయా, నిజంగానే వారు చెప్పినట్లుగా ప్రేక్షకుల్లో పాజిటివ్‌ టాక్‌ ఉందా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

మరిన్ని వార్తలు:

హిందీలో ‘ఫిదా’ చేయగలరా?