ధావన్‌ దెబ్బకు చేతులెత్తేసిన శ్రీలంక

India Won The Match In Sri Lanka Vs India First One-Day

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీలంకపై భారత్ ఘనవిజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ శ్రీలంక ని చిత్తు చిత్తుగా ఓడిచింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో భారత్‌ రాణించడంతో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ 132(90), కెప్టెన్‌ కోహ్లీ 82(70) అద్భుతంగా ఆడడంతో శ్రీలంక నిర్ధేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక భారత బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేసింది. భారత స్పిన్ త్రయం చాహల్, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్ లు లంక పతనాన్ని శాసించారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లతో సత్తా చాటగా, చాహల్, జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించారు. పేసర్ బూమ్రా రెండు వికెట్లు తీశాడు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో 217 పరుగుల సాధారణ లక్ష్యాన్నిమాత్రమే లంక నిర్దేశించగలిగింది.

తర్వాత 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(4) వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా 28.5 ఓవర్లలోనే ఒక వికెట్‌ నష్టానికి 220పరుగులు చేసి సునాయాసంగా మ్యాచ్ ను విజయం వైపు నడిపించారు.

శ్రీలంక బ్యాటింగ్ లో ఓపెనర్లు గుణతిలకా, డిక్ వెల్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. గుణతిలకా(35) అవుటైన తరువాత డిక్ వెల్లా కుదరుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే డిక్ వెల్లా(64) హాఫ్ సెంచరీ సాధించి అవుటైన తరువాత శ్రీలంక బాట్స్ మన్స్ తడబడ్డారు. ఆపై వరుస విరామాల్లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. కుశాల్ మెండిస్(36), ఉపుల్ తరంగా(13), కపుగదెరా(1), హసరంగా(2)లు వరుసగా పెవిలియన్ చేరడంతో లంక స్కోరు మందగించింది. కాగా, ఏంజెలో మాథ్యూస్(36 నాటౌట్) కాస్త ఫర్వాలేదనిపించడంతో లంక రెండొందల మార్కును చేరింది.

మరిన్ని వార్తలు:

ముగిసిన ప్ర‌చారప‌ర్వం

ఆ కాల‌నీని ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు?

ఒకే కొమ్మ కింద‌కు రెండాకులు