Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా కాంపౌండ్ లో ఏం జరిగినా బయటకు తెలిసిపోతుంది. కాదు… కాదు తెలిసేలా చేస్తారు. ముందు లీకులివ్వడం, తర్వాత వాటిని ధృవీకరించడం అదో మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ చిరంజీవి 151వ సినిమా సైలంట్ గా ఓపెనింగ్ జరుపుకోవడమే ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంత రహస్యం అంటే కారణాలు మాత్రం తెలియడం లేదు.
కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ లో హోమాలు చేసి మరీ సినిమాకు టెంకాయ కొట్టారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ , కొడుకు రామ్ చరణ్, డైరక్టర్ సురేందర్ రెడ్డి, మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ మాత్రమే పాల్గొన్నారు. ఇది చిరంజీవి 151వ సినిమా కాబట్టి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం సింప్లిసిటీకే ఓటేసింది.
అభిమానులు ఎప్పట్నుంచో ఎధురుచూస్తున్న ఉయ్యాలవాడ మొదలుకావడంతో ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. ఇప్పటికే ఇదే ఉయ్యాలవాడ లుక్ అంటూ కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు చిరంజీవి అఫిషియల్ లుక్ అనేది ఆయన బర్త్ డే రోజు వస్తుందని చెబుతున్నారు. ఖైదీ నంబర్ 150తో మాస్ ను ఫిదా చేసిన చిరు.. ఉయ్యాలవాడతో అందరికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తారని అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వార్తలు: