ఉప్పు నిప్పులు మద్య పలకరింపుల ముచ్చట్లు

chit chat in assembly

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి, ఉప్పు నిప్పుగా ఉండే నేతలు ఎన్నికల వాతావరణం నుండి తేరుకొని ఆత్మీయ పలకరింపులతో సేద తీరుతున్నారు, నిన్నమెన్నటి వరకూ మాటల తూటాలు పేల్చుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళగిరిలో ఆర్కే చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసింది. తాజాగా అసెంబ్లీ లాబీల్లో ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకొని పలకరించుకున్నారు, మరోవైపు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన సహనటుడు బాలయ్య బాబుని పలకరించారు, ఇంకో అడుగు ముందుకేసి కరణం బలరాంని అన్నా ఇటునుండి కలిస్తే బాగుండు అటునుండి వస్తున్నావు అని పలకరించడంతో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లిపోవడం బలరాం వంతయింది.