మణిరత్నంకి హార్ట్ ఎటాక్….క్లారిటీ ఇచ్చిన సుహాసిని

suhaasini gave clarity on manirathnam heartattack news

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకి గుండె పోతూ అంటూ నిన్న ప‌లు రకాల రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గుండె సంబంధింత వ్యాధితో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చేరార‌ని జోరుగా ప్ర‌చారం జరిగింది. ఈ నేపధ్యంలో సుహాస‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. తన భ‌ర్త త‌దుపరి సినిమా కోసం ఉద‌యం 9:30 గంటలకే ఆఫీస్ కు వెళ్లారని, ఇద్దరం తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో ఇంట్లో బిజీగా ఉన్నామని, తన భర్త ఉదయం చేసిన రోటి, మామిడికాయ పచ్చడి ఇష్టంగా తిని నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీస్ కు వెళ్ళారని సుహాసిని తెలిపింది. దీంతో మ‌ణిర‌త్నం ఆరోగ్యానికి సంబంధించి వ‌స్తున్న పుకార్ల‌కి బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం మ‌ణిరత్నం పొన్నియన్ సెల్వం చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, ఇందులో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇలా ఆయనకీ గుండె పోటు అంటూ వార్తలు రావడం రెండవ సారి, గత సంవత్సరం కూడా ఇలానే ప్రచారం జరిగింది. నిజానికి అయనకి గతంలో రెండు మార్లు గుండెపోటు రావడంతో అప్పటి నుండి ఆయన రెగ్యులర్ చేకప్స్ కి వెళుతూ ఉంటారు, ఆ చేకప్స్ కి వెళ్ళినప్పుడల్లా ఆయన మీద మీడియా ఇలా కధనాలు ప్రసారం చేస్తోంది.