అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోనుందా ?

is Anusuya going to miss Jabardasth

ఓ పక్క యాంకరింగ్‌ చేస్తూనే మరో పక్క వరుస సినిమా అవకాశాలతో మంచి ఊపు మీద ఉంది అనసూయ. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించిన అనసూయ నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది.  యాత్ర సినిమాలో కూడా చేసింది ఒకటి రెండు సీన్లలో అయినా తన నటనానుభవం చూపించింది అనసూయ. ఇప్పుడు అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఆమె మెగాస్టార్‌ చిరంజీవి నటించబోయే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నదట. ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్న చిరు ఆ సినిమా పూర్తయ్యాక కొరటాల శ్రీనివాస్‌ తెరకెక్కించబోయే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయకు కీలక పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తి అయ్యిందని, ఇతర నటీనటులను కూడా ఎంపిక చేయనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చరణ్‌కు రంగమ్మత్తగా, సాయి ధరమ్‌తేజ్‌ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌చేసి మెగా అభిమానులను అలరించిన అనసూయ ఏకంగా మెగాస్టార్ సరసనే నటించే చాన్స్ కొట్టేసిందన్నమాట. అయితే ఈ సమయంలో ఇటు జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మానికి అటు సినిమాల‌కి కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతుంద‌ని, అందుకే ఆమె జబర్దస్త్ ని వీడాలని అనుకుంటుందని సమాచారం.