కరోనా సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదు

కరోనా సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదు

కరోనా వైరస్‌ బారినపడిన కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త కోలుకున్నారు. ఈ నెల 17న ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి తిరుపతి క్యాంప్‌ కార్యాలయంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించారు. ఆదివారం మరోసారి పరీక్షించుకోగా నెగిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌ నుంచి చిత్తూరు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

జిల్లాలో మార్చి నుంచి ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి కరోనా కట్టడికి విశేష సేవలందించారు  ఆయన మాట్లాడుతూ కరోనా సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు తెలిపారు.