స్టేజ్‌ పై కాజల్‌కు ముద్దు పెట్టేసిన చోటా

Chota Kisses Kajal At Kavacham Press Meet

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా తెరకెక్కుతున్న ‘కవచం’ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పలువురు పాల్గొన్నారు. టీజర్‌ విడుదల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఒక్కొక్కరుగా చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడటం జరిగింది. చివరకు కాజల్‌ చిత్రంలో నటించిన విశేషాలను చెబుతూ వచ్చింది. సినిమాలో తన పాత్ర గురించి, బెల్లంకొండ గురించి చెబుతూ వచ్చింది. ఆ సమయంలోనే సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు గురించి మాట్లాడినది. చోటా గారు చాలా మంచి మనిషి అని, ఆయన మంచిగా తనను చూపించాడు అంటూ ప్రశంసల జల్లు కురిపించింది.

Kavacham Teaser Launch

తనపై కాజల్‌ తనపై ప్రశంసలు చేయడంతో చోటా కే నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆ సంతోషాన్ని ఏకంగా కాజల్‌ పై చూపించాడు. తనను పొగిడిన కాజల్‌ ను చోటా కే నాయుడు ముద్దు పెట్టుకుని అందరికి షాక్‌ ఇచ్చాడు. అక్కడ ఉన్నవారు అంతా కూడా షాక్‌ అవ్వడంతో పాటు, సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చూసిన వారు షాక్‌ అవుతున్నారు. ఆ సమయంలో కాజల్‌ ఫీలింగ్‌ ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరికొందరు మాత్రం చోటాకే నాయుడు తాగి ఎక్కువ అయ్యిందని అంటున్నారు. మొత్తానికి కవచం చిత్రానికి సంబంధించిన సంఘటన అవ్వడంతో ఆ సినిమా గురించి తెగ పబ్లిసిటీ జరిగిపోతుంది.