చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ విచారణ..

Election Updates: Chandrababu to Delhi today.. Announcement of alliance with BJP..!
Election Updates: Chandrababu to Delhi today.. Announcement of alliance with BJP..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. నిన్న హైకోర్ట్ లో చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీనితో సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేయడం జరిగింది. సోమవారం దీనిపై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు చంద్రబాబు ను సిఐడి డీఏస్పీ ధనుంజయ్ నేతృత్వంలోని ఒక బృందం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారిస్తోంది. ఉదయం నుండి విచారణలో ఉండగా… ఇప్పుడే విచారణకు బ్రేక్ ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక గంటకు ఇద్దరు అధికారులు చంద్రబాబును విచారిస్తున్నారట.

ఈ విచారణలో భాగంగా బాబును అడిగిన ప్రశ్నలను చూస్తే, సీమెన్స్ కంపెనీ కి తెలియకుండానే వారి పేరుతో MOU చేసుకున్నారా?కాబినెట్ అనుమతి లేకుండా ఎందుకు స్కిల్ డెవెలప్మెంట్ ఏర్పాటు చేశారు ? ఇక ప్రభుత్వ అధికారులు అభ్యంతరం తెలిపినా ఎందుకు నిధులు విడుదల చేశారు ? లాంటి ఎన్నో ప్రశ్నలను చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది . మరి వీటికి చంద్రబాబు ఏమి సమాధానం ఇచ్చారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.