సెలబ్రెటీలు ఎదురు చూస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’

Cine celebrities are also looking forward to this Ee Nagaraniki Emaindi Movie

‘పెళ్లి చూపులు’ ఫేం తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించిన విషయం తెల్సిందే. తరుణ్‌ భాస్కర్‌ మొదటి చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్దం అయ్యింది. ఇక ఈ చిత్రంతో పలువురు కొత్త వారు పరిచయం కాబోతున్నారు. సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయింది.

సాదారణ ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం విభిన్నమైన కథాంశంతో, ఆకట్టుకునే కథనంతో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించి ఉంటాడు అంటూ ప్రచారం జరుగుతుంది. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ వారంలోనే విడుదల కాబోతున్న ఈ చిత్రం ఓవర్సీస్‌లో వీకెండ్‌ సినిమా భారీ ఎత్తున విడుదలకు ప్లాన్‌ చేసింది. రేపు భారీ ఎత్తున అమెరికాలోని పలు నగరాల్లో ప్రత్యేక షోలు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ‘పెళ్లి చూపులు’ స్థాయిలో ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని భావించిన నలుగురు కుర్రాళ్లు పడ్డ కష్టాలు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులను దర్శకుడు సరదాగా చిత్రీకరించాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.