మహేష్ రికార్డు బద్దలుకొట్టిన చెర్రీ !

Ram Charan Rangasthalam breaks Mahesh babu Pokiri Record

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. ఎప్పుడూ లేనిది నటన పరంగా రామ్ చరణ్‌కు మంచి మార్కులు పడ్డాయి. తన కెరీర్‌లో ది బెస్ట్ యాక్టింగ్ అని విమర్శకులు సైతం ప్రశంసించారు. సినిమా విడుదలై చాలా రోజులైనా ఇప్పటికీ సుకుమార్ అండ్ కో ‘రంగస్థలం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన ‘రంగస్థలం’ తాజా మరో రికార్డును బ్రేక్ చేసింది. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాల్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ‘రంగస్థలం’ 89 రోజుల్లో రూ.1,61,51,363 వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు ‘పోకిరి’ పేరిట ఉన్న రూ. 1,61,43,091 వసూలు రికార్డును ‘రంగస్థలం’ బద్దులు కొట్టింది. అయితే ‘పోకిరి’ది ఫుల్ రన్‌టైమ్ వసూలు. కానీ ‘రంగస్థలం’ దీన్ని 89 రోజుల్లో బద్దలుకొట్టడం విశేషం. అప్పటి సినిమా టికెట్ ధరలకు, ఇప్పటి ధరలకు ఎంతో వ్యత్యాసం ఉన్నా రికార్డు రికార్డే కదా!