బీజేపీ కి రాందేవ్ బాబా ఝలక్.

yoga Guru ramdev baba shock to bjp at london tour

2019 ఎన్నికలకు సిద్ధం అవుతున్న బీజేపీ కి పెద్ద ఝలక్ తగిలింది. అది కూడా బీజేపీ ని అభిమానించే యోగ గురు రామ్ దేవ్ బాబా దగ్గర నుంచి ఆ షాక్ తగిలింది. ముందస్తు ఎన్నికలకు వెళదాం అని ఆలోచిస్తున్న బీజేపీ కి రామ్ దేవ్ ఇచ్చిన ఝలక్ చిన్నదేమీ కాదు. ఆయన మాటలు వింటే బీజేపీ ముందస్తుకు వెళ్లే ధైర్యం చేయదు. ఇంతకీ రామ్ దేవ్ ఇచ్చిన షాక్ ఏంటనేగా మీ ఆదుర్దా..

ఓ యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ దేవ్ బాబా లండన్ వెళ్లారు. సహజంగానే అక్కడ భారత రాజకీయాలు , సార్వత్రిక ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ఆయన బీజేపీ కి అనుకూలంగా మాట్లాడతారని అంతా అనుకున్నారు. అయితే రామ్ దేవ్ భిన్నంగా స్పందించారు. బీజేపీ కి మరీ ముఖ్యంగా మోడీ మళ్ళీ ప్రధాని కాకూడదు అన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఓబీసీ, దళితులు , మైనారిటీలు ఏకం అవుతున్నారని…అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టం అని రామ్ దేవ్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ మూడు వర్గాలు ఏకతాటి మీదకు రావడం కూడా కష్టమే అని చెప్పడం ద్వారా బీజేపీ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు ఆయన. కానీ వాస్తవం వేరుగా వుంది. ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ లు కలిసి బీజేపీ ని దెబ్బ కొట్టిన వాస్తవం కళ్ల ముందు కనబడుతూనే వుంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ మీద ఎన్నో సందేహాలు లేవనెత్తిన రామ్ దేవ్ తాజాగా జనం ఆమోదం పొందిన ఎవరైనా ప్రధాని కావొచ్చు అని వ్యాఖ్యానించారు. మొత్తానికి లండన్ టూర్ లో రామ్ దేవ్ మాటలు బీజేపీ కి వార్నింగ్ బెల్స్ మోగించినట్టే .