ఎన్టీఆర్‌కు కూతురు పుట్టింది .. లేదు లేదు!!

ntr family clarity on NTR wife lakshmi pranathi gives birth baby girl rumours

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 సోషల్‌ మీడియా ఈమద్య చాలా పవర్‌ ఫుల్‌ అయ్యింది. చిన్న విషయం కూడా చాలా స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతున్నాయి. గతంలో పలు పుకార్లు గంటల వ్యవదిలో మొత్తం ప్రపంచం అంతా కూడా పాకిన విషయం తెల్సిందే. తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక విషయం గురించి చిటికెలో పుకార్లు దావానంలా వ్యాప్తి చెందింది. ఇంతకు ఆ పుకారు ఏంటీ అంటే.. ఎన్టీఆర్‌ మరోసారి తండ్రి అయ్యాడు అని, జూన్‌ 3వ తేదీ రాత్రి సమయంలో లక్ష్మి ప్రణతి బిడ్డకు జన్మనిచ్చింది అంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దాంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మరియు తెలుగు సినిమా ప్రముఖులు అంతా కూడా నిజమే అనుకుంటూ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్‌ ఫ్యామిలీ నుండి క్లారిటీ వచ్చింది.

లక్ష్మి ప్రణతి గర్బవతి అనే విషయం నిజమే కాని, ఆమె పాపకు జన్మనిచ్చిన మాట వాస్తవం కాదని, అవన్ని పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్‌ మళ్లీ తండ్రి కాలేదు అని, ఎన్టీఆర్‌ రెండవ సారి తండ్రి అయ్యేందుకు మరి కొన్ని వారాల సమయం ఉందని కూడా వారు చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోవద్దని కూడా నందమూరి సన్నిహితులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు కొందరు పబ్లిసిటీ కల్పించడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఆ వార్త తెలుస్తుందని టెక్‌ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు ఎన్టీఆర్‌ సిద్దం అవ్వబోతున్నాడు.