సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి 8 మంది మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదం జరిగిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.




