రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. ఏపీని రెవెన్యూ జనరేటర్‌లా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అంతేకాదు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టేలా.. చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎర్రచందనం అమ్మకానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
