కాళేశ్వరం కేంద్రంగా కేసీఆర్ రాజకీయం

cm-for-speedy-completion-of-canals-under-kaleswaram-project

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్ నమ్ముతున్నారు. ఇదే మాట చాలా మంది రైతులు కూడా బలంగా నమ్ముతున్నారు. కానీ కొంతమంది మాత్రం తమ భూములకు సరైన పరిహారం దక్కడం లేదని ఆందోళన చేస్తున్నారు. అందుకే ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో టూర్ కు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.

ఇప్పటిదాకా ప్రగతి భవన్ నుంచి కదలకుండా ప్రత్యర్థుల్ని ఎదుర్కున్న కేసీఆర్.. ఇక ప్రజల్లోకి వెళ్లి ప్రతిపక్షాల లెక్కేంటో చూడాలని డిసైడయ్యారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న రాజకీయంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంటి వాటిల్లో కేసులు వేయడంపై కేసీఆర్ అసహనం వ్యక్ం చేస్తున్నారు.

ప్రతిపక్షాల పరిస్థితిని జనంలోనే ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా తాను కూడా రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని ఆయన చాలాకాలంగా అనుకుంటున్నారు. ఇప్పుడు సమయం, సందర్భం అన్నీ కలిసొస్తాయని ఆయన నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ దక్కడం, ప్రతిపక్షాలపై ఎధురుదాడే లక్ష్యంగా సీఎం రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు గులాబీ నేతలు.

మరిన్ని వార్తలు:

ఏపీలో ముచ్చటగా మూడో ఎన్నిక
అందరివాడినంటున్న కామినేని