నేడు ఢిల్లీకి సీఎం జగన్ పర్యటన..రెండు రోజుల షెడ్యూల్ ఇదే..

CM Jagan's visit to Delhi today..This is the schedule for two days..
CM Jagan's visit to Delhi today..This is the schedule for two days..

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ బయలుదేరనున్నారు. పదిన్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీకి సీఎం జగన్‌ చేరుకోనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రధాని, హోమ్ మంత్రి లతో సీఎం జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు విఙాన్ భవన్ కు చేరుకోనున్న సీఎం జగన్‌. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. అనంరం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి 10 రాష్ట్రాలు హాజరుకానున్నాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ‌ సమావేశం కొనసాగనుంది.