తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల సంగతి పక్కనపెడితే ఆయన ఔదార్యంలో సాటి. ఈ విషయం చాలా సార్లు నిరూపితం అవగా ఇప్పుడు మరో సరి నిరూపితం అయ్యింది. ప్రకృతి వైపరీత్యాలతో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలిచారు. తెలంగాణ తరపున రూ.25కోట్ల రూపాయల తక్షణ సాయాన్ని ప్రకటించారు. అలాగే రెండున్నర కోట్ల విలువైన నీటి శుద్ధి యంత్రాలను కూడా తెలంగాణా నుండి పంపుతున్నారు. అదే సమయంలో కేరళ కోసం ఎవరైనా సీఎంల రిలీఫ్ ఫండ్ కు నిధులి ఇస్తే వెంటనే ఆ రాష్ట్రానికి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ. 10 కోట్ల సాయాన్ని ప్రకటించారు.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 5 కోట్లకు అటూ ఇటూగా సాయాన్ని ప్రకటించాయి. దరిద్రం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. కేసీఆర్ ప్రకటించిన రూ. 25 కోట్ల సాయం ఓ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిగ్గుపడేలా చేస్తోంది. రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్రం దక్షినాది రాష్ట్రాల పట్ల అత్యంత తీవ్రమైన వివక్ష చూపుతోందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే నిధులను 57 శాతం తన వద్ద ఉంచుకునే కేంద్రం రాష్ట్రాలు ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న సమయంలో ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ నిధిని నిర్వహిస్తూంటుంటంది. అలాంటి ఏర్పాటు ఉన్నప్పటికీ మోడీ కేరళకు కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ప్రకటించారు. కేరళకు తోటి రాష్ట్రాలు ప్రకటించిన మొత్తంతో పోలిస్తే ఇది తక్కువే.
దక్షినాది రాష్ట్రాల మీద ఈ కుంచిత బుద్ధి ఇప్పుడే కాదు గతంలో కోద్ద చూపించారు శ్రీ మాన్ మోడీ. గతంలో విశాఖను హుదూద్ తుపాను చిన్నాభిన్నం చేసినప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే చేశారు. భారీగా నష్టం వచ్చిందని నగరం అంతా ధ్వంసం అయిందని నిర్ణయించి రూ. 1000 కోట్ల తక్షణ సాయంగా ప్రకటించారు. ఆ తర్వాత నష్టం గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి నివేదిక పంపింది. కానీ అంత పెద్ద నష్టం జరగలేదని చెప్పి. రూ. 450 కోట్లకు అటూఇటుగానే విడుదల చేశారు. దీంతో ఇప్పుడు కేరళ విషయంలో కూడా మోడీ అదే చేస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా కేరళ ఆయనకు పెద్దగా అవసరపడక పోవచ్చు కదా.