మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు

cm kcr birthday wishes to minister jagadeesh reddy

హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ 54వ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేసి జగదీశ్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. జగదీశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.