ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకి సంబందించిన కౌంటింగ్, ఫలితాలు నేడు బయటపడ్డాయి… కాగా రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి పుర పోరు లో కూడా క్లీన్ స్వీప్ చేస్తానని గట్టి నమ్మకంతో ఉన్న అధికార తెరాస పార్టీ నేతలు దాన్ని నిజం చేసి చూపించారు. కానీ కొన్ని స్థానాల్లో పరిస్థితి చేయి దాటినట్లు కనిపించినప్పటికీ కూడా, ఎక్కువగా తెరాస ఆధిక్యత సాధించింది. కానీ కొన్ని మెజారిటీ స్థానాల్లో మాత్రం తెరాస కి షాక్ తగిలిందని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికి కూడా లీడ్ లో తెరాస పార్టీ హవా నడుస్తుందని అర్థమవుతుంది.
కాగా ఎన్నికలకు ముందు అధికార తెరాస పార్టీ ని ఓడించడానికి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గట్టిగానే ప్రయత్నించాయనే చెప్పాలి. ఇకపోతే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అధికార తెరాస పార్టీని పడగొట్టే సత్తా ఎవరికీ లేదని తెరాస నేతలు మరొక సారి నిఱ్పఉంచుకున్నారు. ఇకపోతే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని చేస్తున్నటువంటి మంచి పనుల దృష్ట్యా, ప్రజల్లో సీఎం కేసీఆర్ మీద నమ్మకం పెరిగినందువల్లే ఈ సంపూర్ణ విజయం దక్కిందని తెరాస నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ పుర ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మంత్రి కేటీఆర్ మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర నేతలందరూ కూడా ప్రగతి భవన్ లో సంబరాలు జరుపుకుంటున్నారు.