మోదీకి లేఖ రాసిన సీఎం

మోదీకి లేఖ రాసిన సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణను కేంద్రం ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని అన్నారు. అయితే తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం కేంద్రాన్ని 1,350 కోట్ల సాయం కోరారు.

అయితే తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలో చెరువులు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని చాలా కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై అన్ని రకాల చర్యలను చేపడుతుంది.