ముందస్తు మీద కేసీఆర్ అదిరే వ్యూహం !

CM KCR Political Strategies on Early Elections

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసే ప్రతి పనీ ఇప్పుడు తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ రాజేస్తోంది. ఆయ‌న నిన్న తమ పార్టీ క్యాడర్ కి ఇచ్చిన ముంద‌స్తు క్లారిటీతో ఎన్నికలు దగ్గరకు వచ్చాయన్న సంగతి మిగతా పార్టీల వారికి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికలకి వంద సీట్లు అంటూ తన టార్గెట్ పార్టీ శ్రేణులకి నిర్దేశించిన ఆయన మరో పది పన్నెండు రోజుల్లో కలవాల్సి వస్తుందంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకి చెప్పడం అసెంబ్లీ రద్దును సూచిస్తుందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా విపరీతమైన జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉన్న కేసీఆర్ తన నక్షత్ర పరంగా అన్ని విధాలా అనుకూలమైన సెప్టెంబర్ ఆరవ తేదీన అసెంబ్లీ రద్దు చేయనున్నారని తెలుస్తోంది. డిసెంబ‌ర్‌లో రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మిజోరం, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల‌తోపాటు తెలంగాణ‌లో జ‌రిగే అవ‌కాశాలు కనపడుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే టీఆర్ఎస్ అధినాయకత్వానికి కొంత నమ్మకం వచ్చినట్టు కనిపిస్తోంది.

 CM KCR

మరింత స్పష్టత వచ్చిన వెంటనే అసెంబ్లీ రద్దు ప్రక్రియను మొదలు పెట్టాలని భావిస్తోంది. అసెంబ్లీకి, పార్లమెంటుకు విడివిడిగాను, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగితే ప్రయోజనం ఉంటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేనాటికి ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ అలానే జరిగితే గనుక ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తమ జెండా ఎగురవేస్తుంది అలా జరిగితే తెలంగాణాలో కూడా కేసీఆర్ కు కాంగ్రెస్ నుండి గట్టి పోటీ తప్పదు, అంతేకాక అలా కాకుండా అసెంబ్లీకి, పార్లమెంటుకు విడివిడిగా ఎన్నికలు జరిపితే టీఆర్‌ఎస్‌కు ఎదురు ఉండదని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలోని అంశాల ప్రాతిపదికగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అవి తమకు లాభం చేకూరుస్తాయని గులాబీ దళాధిపతి లెక్కలు వేస్తున్నారని తెలుస్తోంది.

Kcr on Early Elections