పయ్యావుల మీద కెసిఆర్ లైట్ పడింది.

cm-kcr-secret-meeting-with-tdp-leader-payyavula-keshav-at-paritala-house

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పయ్యావుల కేశవ్ …టీడీపీ లో వాక్సుద్ధి వున్న నాయకుల్లో ఒకడు. ఏ టాపిక్ మీద అయినా తడుముకోకుండా ఎంతైనా మాట్లాడగలడు. సీఎం చంద్రబాబుకి సన్నిహితుడు. అయితే ఎన్ని వున్నా లాభం ఏముంది. అదృష్టం మాత్రం ఆవగింజంత తక్కువగా వుంది. అందుకే ఆయన 1999 అసెంబ్లీ ఎన్నికల నుంచి బరిలో వున్నా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. 2004 , 2009 లో ఆయన గెలిస్తే పార్టీ అధికారానికి దూరం అయ్యింది. ఇక 2014 లో పార్టీ గెలిస్తే ఆయనకి ఓటమి ఎదురు అయ్యింది. ఇక అనంత నుంచి పరిటాల సునీతమ్మకి మంత్రి పదవి తప్పనిసరిగా ఇవ్వాల్సి రావడంతో సామాజిక వర్గాల లెక్కల ప్రకారం మంత్రి పదవి కేశవ్ కి ఎన్నడూ అందని ద్రాక్ష అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎమ్మెల్సీ ని చేసి కొంత ఊరట కలిగించారు సీఎం చంద్రబాబు.

ఎమ్మెల్సీ పదవి, చంద్రబాబు దగ్గరికి ఎప్పుడైనా వెళ్లే చనువు, చొరవ ఉన్నప్పటికీ పయ్యావుల ఇంతకుముందులా ప్రెస్ తో మాట్లాడడం లేదు. పార్టీలో చురుగ్గానే వున్నా బయటికి ఆయన కనిపించడం కాస్త తగ్గింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ పరిటాల ఇంటి పెళ్ళికి వచ్చి స్వయంగా పయ్యావుల తో ఏకాంత చర్చలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. 15 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చల్లో నంద్యాల, కాకినాడ ఫలితాలతో పాటు టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాల గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇంత బంధం ఎక్కడిదా అని చాలా మందికి డౌట్ వుంది. పయ్యావుల అనంత జిల్లా టీడీపీ లో చురుగ్గా వున్నప్పుడు ఆ జిల్లా ఇంచార్జి మంత్రిగా కెసిఆర్ వ్యవహరించారట. అప్పుడే ఈ ఇద్దరి మధ్య బంధం బలపడింది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లల తూటాలు పేలినా అది కేవలం రాజకీయాలకే పరిమితమని తాజా ఘటనతో తేలిపోయింది. మొత్తానికి కెసిఆర్ ఇచ్చిన ప్రాధాన్యం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేశవ్ మీద జనం లైట్ పడింది.