అర్జున్ రెడ్డిని కాలేక‌పోయాను

hero sharwanand feels the loss of arjun reddy movie officer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ సినిమా అవ‌కాశాన్ని ఏదో ఓ కార‌ణం చేత తిర‌స్క‌రించిన త‌రువాత‌….ఆ చిత్రం పెద్ద హిట్ట‌యితే….ఆఫ‌ర్ ను వ‌దులుకున్న‌వారికి క‌లిగే బాధ మాటల్లో చెప్ప‌లేము. హీరో శ‌ర్వానంద్ ఇప్పుడు ఆ ప‌రిస్థితిలోనే ఉన్నారు. చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి లో న‌టించే అవ‌కాశం ముందుగా శ‌ర్వానంద్ కు వ‌చ్చింద‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టిదాకా డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి ఆ విష‌యాన్ని అనేక ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. తాజాగా శ‌ర్వానంద్ కూడా…ఆ విష‌యాన్ని అంగీక‌రించాడు.

అర్జున్ రెడ్డి క‌థ‌ను ముందు త‌న‌కే వినిపించార‌ని, సినిమాకు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఒక‌రే అని తాను ఆ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించాన‌ని శ‌ర్వానంద్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. నిర్మాణ బాధ్య‌త‌లు కూడా…ద‌ర్శ‌కుడిపై ప‌డితే సినిమాకు స‌రైన న్యాయం చేయ‌రేమో అని తాను భావించాన‌న్నాడు. ఆ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించినందుకు బాధ‌గా ఉంద‌న్నాడు. అయితే అర్జున్ రెడ్డిలో విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా బాగా న‌టించాడ‌ని, ఈ సినిమాను స‌రైన న‌టుడే చేశాడ‌ని శ‌ర్వానంద్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన ఉత్త‌మ‌చిత్రం అర్జున్ రెడ్డి అని ప్ర‌శంసించాడు.