ఇదంతా సినారెపై ప్రేమేనా..?

CM KCR Using Telangana Sentiment in C Narayana Reddy

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగులో ఎంతోమంది ప్రముఖ కవులు చనిపోయారు. వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఓ కవి అంతిమయాత్రకు వంద బస్సులు పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజంగా సినారెపై ప్రేమతోనే ఇలా చేస్తున్నారా.. లేదంటే రాజకీయ వ్యూహం అందా అనే సందేహాలు వస్తున్నాయి. సినారె అభిమానులు అంతమంది ఉంటారా అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది.

ఏదేమైనా సినారె గొప్ప కవి. అందులో ఎవరికీ సందేహం లేదు. కానీ ఆయన పాత తరానికి చెందిన వారు. ప్రస్తుత తరంలో ఆయన పేరు చాలా మందికి తెలిసినా.. అంతిమయాత్రకు వచ్చేంత అభిమానం కొద్దిమందికే ఉంటుంది. ఆ వచ్చేవారు కూడా సినీ పరంగా అభిమానులు కాకుండా.. సాహితీపరంగా సినారె లోతును అర్థం చేసుకున్నవారు అయ్యుంటారు. అంటే వారు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. అలాంటిది వంద బస్సుల్లో జనాన్ని హైదరాబాద్ తరలించాలని కేసీఆర్ ఎందుకు నిర్ణయించుకున్నారనేది అర్థం కాని ప్రశ్న.

సినారె అంతిమయాత్రతో కూడా తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించాలనేది గులాబీ బాస్ ప్లాన్ గా ఉంది. ఇప్పటికే మూడు చోట్ల కాంస్య విగ్రహాలు, హైదరాబాద్ లో స్మారక భవనం నిర్మిస్తామని కేసీఆర్ చెప్పడమే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజంగా సినారెపై ప్రేమతో ఇవన్నీ చేస్తారా.. లేదంటే జన స్పందనను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారా అనేది అంతుచిక్కని ప్రశ్నే.