ఈనెల 17న సీఎం కేసీఆర్ సిరిసిల్లకు రానున్నారు. ఈ నెల 17న సిరిసిల్లలో నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ నాయకులకు పిలుపునిచ్చారు. హైదరాబాదులో సిరిసిల్ల నాయకులతో బుధవారం కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్బంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి తనకు డబ్బులు సంపాదించే ఏటీఎంగా వాడుతున్నారు… ఓటుకు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు… నోటుకు సీటు అంటూ… రేటెంత అంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.