ఆజాద్ తో సీఎం రమేష్ చర్చలు 2019 కోసమేనా?

CM Ramesh Meets To Ghulam Nabi Azad for alliance
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతుందని వేస్తున్న అంచనాలు నిజం కాబోతున్నాయా ? ఔను. ఇప్పటిదాకా లోలోపల ఆ దిశగా కనిపించిన పరిణామాలు ఇప్పుడిప్పుడే బహిరంగమవుతున్నాయి. కొన్నాళ్లుగా బీజేపీ , టీడీపీ మధ్య లుకలుకలు ఎంత దాచినా దాగడం లేదు. ఇక పొత్తుకు ఏ క్షణం అయినా ఫుల్ స్టాప్ పడే అవకాశం వుంది. ఇందుకు తాజాగా పెద్దల సభలో ట్రిపుల్ తలాక్ వ్యవహారంలో కాంగ్రెస్ కి టీడీపీ వంత పాడడం కన్నా ఉదాహరణ ఏముంటుంది ?

ముస్లిం మహిళకు వివాహ హక్కుల భద్రత కల్పించే ఉద్దేశంతో బీజేపీ రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజకీయ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కూడా సై అనడంతో అంతా సజావుగా సాగింది. అయితే లోక్ సభలో ఎంత తేలిగ్గా ఆ బిల్లు ముందుకు వెళ్లిందో, రాజ్యసభలో అంత గట్టిగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ రాజ్యసభ దగ్గరికి వచ్చేసరికి ఓ పేచీ పెట్టింది. ఈ బిల్లుని పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టాకే రాజ్యసభలో చర్చ జరపాలని పట్టు బట్టింది. ఇందుకు బీజేపీ ససేమిరా అనడంతో బిల్లు కి ఇబ్బంది ఏర్పడింది. అయితే కాంగ్రెస్ వాదనకు సమాజ్ వాది, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు టీడీపీ మద్దతు ఇవ్వడం బీజేపీ కి ఊహించని షాక్. మిత్రపక్షమే ఎదురు తిరగడంతో ఈ బిల్లు విషయంలో మిగిలిన పక్షాలకి సమాధానం చెప్పుకోవడం బీజేపీ కి ఇబ్బంది అవుతోంది.

అయితే అంతకన్నా ఇబ్బంది పెట్టిన విషయం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చర్చలు జరిపాడు అన్నది. తలాక్ బిల్లు విషయంలో ఈ చర్చలు జరిగాయని చెబుతున్నప్పటికీ అంతకు మించిన లోతులు ఈ భేటీ వెనుక వున్నాయి అంటున్నారు. మిత్రపక్షాన్ని ఏ మాత్రం లెక్క చేయని బీజేపీ కి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు ఓకే అన్నాక ఈ భేటీ జరిగింది అంటున్నారు. జగన్ వైపు చూస్తున్న బీజేపీ ని వదిలించుకోవడము బెటర్ అని బాబు కూడా ఫీల్ అవుతున్నారంట. 2019 ఎన్నికల ముందే బీజేపీ, వైసీపీ అంటకాగడం ఖాయం అని నిర్దారణకు వచ్చిన బాబు ఆ ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ మద్దతుతో ఏపీ కి ప్రత్యేక హోదా తెచ్చే ఆలోచన చేస్తున్నారట. అందుకు తొలి అడుగే ఆజాద్, రమేష్ భేటీ అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.