‘అజ్ఞాతవాసి’ గురించి ఆసక్తికర విషయాలు

pawan name in agnathavasi
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదలకు రోజులు దగ్గర పడుతున్నాయి. సంక్రాంతి సందర్బంగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీగా విడుదల చేయబోతున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్శిల్‌ స్టూడియోలో ప్రదర్శించబడుతున్న మొదటి ఇండియన్‌ చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ రికార్డు సాధించబోతుంది. ఈ చిత్రం కేవలం అమెరికాలో 500లకు పైగా స్క్రీన్స్‌లో వేయబోతున్నారు. ప్రీమియర్‌ షోల ద్వారా మూడు మిలియన్‌ల డాలర్ల వసూళ్లు లక్ష్యంగా డిస్ట్రిబ్యూటర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ పేరు అభిజిత్‌ భార్గవ్‌ అంటూ సమాచారం అందుతుంది. ఇప్పటికే పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ మరియు ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్లో పవన్‌ పేరు చాలా విభిన్నంగా ఆలోచించి పెట్టిన దర్శకుడు ఈ చిత్రంలో కూడా పవన్‌ పేరును ప్రత్యేకంగా పెట్టాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పవన్‌ పేరుకు ఈ చిత్రంలో ప్రత్యేకత ఉందని, కథలో భాగంగా పవన్‌ పేరు ఉంటుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. అభిజిత్‌ భార్గవగా పవన్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పవన్‌ గత చిత్రాలతో పోల్చితే చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.