త్వరలో చింతమడకకు సీఎం

cm soon to chinthamadaka

సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి రానున్నారు. గ్రామస్థులతో ఆత్మీ య సమ్మేళనం, సహపంక్తి భోజనాలు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. సీఎం రాక నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్‌లతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఏర్పాట్ల ను పరిశీలించారు. గ్రామంలోని ఐకేపీ గోదాం సీసీ ప్లాట్‌ఫామ్ వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పెద్దమ్మ దేవాలయ సమీపంలో వన భోజనాల ఏర్పాట్లకు స్థలాన్ని పరిశీలించా రు. ఆలయం పక్కనే చింతచెట్టు కింద సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేసేందుకు, దమ్మచెరు వు వద్ద హెలీపాడ్ కోసం కలెక్టర్, సీపీతో చర్చించారు. గ్రామంలో చేపట్టిన విద్యుత్, తాగునీరు, మురుగు కాల్వల నిర్మాణం, రోడ్డువిస్తరణ పను లు, పారిశుద్ధ్య పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు గ్రామంలో మూడు గంటల పాటు పర్యటించి స్థానికులతో మాట్లాడారు.