17.5 లక్షలతో క‌పిల్‌ బ్యాట్ కొనుక్కున్న ఎన్ఆర్ఐ

nri purchased kapildev bat

అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తానా 22వ మహాసభలు గురువారం( జూలై 4)న‌ అంగరంగ వైభవంగా ప్రారంభమయిన ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఉండే తెలుగువారు ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుక‌కి తెలుగు రాష్ట్రాల నుండి కళా,రాజకీయ,సినీ,క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి సారి ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఎంపీలు సీఎం రమేశ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. విశ్వంజీ, పరిపూర్ణానంద స్వామీజీలు తమ ప్రసంగాలతో ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లారు. నేటితో ఈ వేడుక‌లు ముగియ‌నున్నాయి. అయితే ఈ వేడుక‌లో ఓ ఎన్ఆర్ఐ క‌పిల్‌దేవ్ సంత‌కం చేసిన క్రికెట్ బ్యాట్‌ని వేలంలో 25వేల డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా 17.5 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. ఇండియాకి తొలి వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్‌దేవ్‌కి క్రేజ్ ఇంకా ఏ రేంజ్‌లో ఉందో ఈ లెక్క‌ల‌ని బ‌ట్టే తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌పిల్ జీవిత నేప‌థ్యంలో 83 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.